తారు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి నాలుగో వార్డు పరిధిలో తారురోడ్డు మరమ్మతు పనులను కార్పొరేటర్‌ దౌలపల్లి కొండబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డు పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాల్లో కూడా రోడ్డు సదుపాయం కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️