లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలి

Jun 30,2024 00:54 #Lok Adhalath
Lok Adhalath

ప్రజాశక్తి-యంత్రాంగం లీగల్‌ : జాతీయ లోక్‌ అదాలత్‌ను వినియోగించుకొని కక్షిదారులు వ్యయ, ప్రయాసలు లేని న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఆలపాటి గిరిధర్‌ సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా అనేక కేసులు లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కోర్టులు ఉన్నచోట సుమారు 30 ప్రజా న్యాయ పీఠాలను ఏర్పాటుచేసి కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి తెలియజేశారు. సుమారుగా 3,500 కేసులు పరిష్కారాన్ని గుర్తించినట్లు తెలిపారు. నగరంలో అనేక కోర్టుల్లో ఇన్స్యూరెన్స్‌, చెక్‌ బౌన్స్‌, ప్రజా పౌరసేవలో, జివిఎంసి, బ్యాంకు, ఇతర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్‌ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కొన్ని సివిల్‌ కేసులు కూడా పరిష్కారమైనట్లు వివరించారు.204 కేసులు పరిష్కారం భీమునిపట్నం : స్థానిక పిడిఎం కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్‌ అదాలత్‌లో 135 సివిల్‌, క్రిమినల్‌ కేసులు, ఫస్ట్‌ ఎడిఎం, సెకండ్‌ ఎడిఎం కోర్టుల ఆవరణలో జరిగిన లోక్‌ అదాలత్‌లో 69 సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కారమైనట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఆయా కోర్టు ప్రాంగణాల్లో జడ్జిలు నాగేశ్వరరావు, సౌజన్య, ఆధ్వర్యాన లోక్‌ అదాలత్‌లు నిర్వహించారు. ఎపిపి రవితో పాటు, ఎజిపి, ఎంసిహెచ్‌ పాత్రుడు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎంవి.పార్వతీశం, కార్యదర్శి కెఎస్‌ఎం.సుధాకర్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు దత్తి ఈశ్వరరావు, న్యాయ వాదులు పాల్గొన్నారు.

➡️