తుపానుతో రైతుల గుండెల్లో గుబులు

రాజోలు మండలం శివకోడులో ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు

పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు.. కమ్ముకుంటున్న మబ్బులు అన్నదాత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తుపాను హెచ్చరికలతో రైతుల గుండెల్లో గుబులు నెలకొంది.రెండు చోట్లల్లో తీరాన్ని తాకనున్న మిచంగ్‌ తుపాను. డిసెంబర్‌ 5-6న రెండు సార్లు తీరాన్ని తాకనున్న భారీ తుపాను బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుంది. ఈ తుపాను వ్ర తుఫాన్‌ గా మారి నెల్లూరు – కావలి తీరం వద్ద పాక్షికంగా తీరాన్ని తాకి బలహీనపడి తుపాను గా మళ్లీ బాపట్ల కి దగ్గరగా తీరాన్ని తాకనుంది. మొత్తం కోస్తాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, గాలులు 70-80 కి.మీ. (గంటకు) వీచే అవకాశాలు ఎక్కువగా ఉందని జిల్లా యంత్రాంగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ప్రజాశక్తి-రాజోలు

జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. రామచంద్రపురం డివిజన్‌లోని రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. అమలాపురం డివిజన్‌లో అక్కడక్కడ స్వల్పంగా రైతులు వరి కోతలు పూర్తి చేసి మాసూళ్లు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో మాత్రమే మాసూళ్లు పూర్తికాగా.. కొన్ని చోట్ల పంట పనల మీద ఉంది. పంటచేతికొచ్చే దశలో వాతావరణం మేఘావతం కావడంతో రైతులు హడావుడిగా కట్టేతకట్టి గట్టుమీదకు తెస్తున్నారు. వాతావరణ పరిస్థితుల దష్ట్యా రైతులు కోతలు నిలుపుదల చేశారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా రైతులు ముంపును తట్టుకునే స్వర్ణ రకం (ఎంటీయూ 7029)ను సాగు చేయడం ఆనవాయితీ. సుమారు 50 శాతానికి పైగా స్వర్ణ రకం వరి వంగడాన్నే పెట్టారు. కోతకు వచ్చిన వరిచేలు ప్రస్తుతం వీస్తున్న గాలులకు పూర్తిగా నేలమట్టమవుతున్నాయి. బలమైన గాలుల కారణంగా నేలవాలిన వరిచేలు కోతలు కోయడానికి, కట్టేతకు ఎకరాకు మరో అయిదుగురు కూలీలు అదనంగా కావాల్సి రావడంతో.. మాసూళ్లకు తమపై మరింత భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వారు ఆందోళన చెందుతున్నారు.పంట చేతికొచ్చే సమయంలో…!ఈ ఖరీఫ్‌లో అన్నదాతలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకుంటే.. చేతికొచ్చే సమ యానికితుపానుప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆక్వాకు తుపాను గండంతుపాను రానుందన్న వాతావరణశాఖ హెచ్చరికతో ఆయా రైతుల్లో భయాందోళన నెలకొంది. రెండురోజులుగా వాతావరణం చల్లబడి చిరుజల్లులు పడటంతో చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్ప డింది. దీంతో రొయ్యలు మతువాత పడే ప్రమాదం ఉందని వారంతా దిగాలు చెందు తున్నారు. రెండు సంవత్సరాలుగా డిసెంబర్‌లో సంభవించే తుపాన్లతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాల బాట పట్టి అప్పుల పాలవుతున్నారు. ఎన్నో ఒడిదొడు కులు ఎదుర్కొంటున్నారు.అంబేద్కర్‌ కోనసీమలో దాదాపు అధికారికంగా, అనాదికారికంగా సుమారు 35 వేల ఎకరాల్లో రొయ్యల సాగు అవుతోంది. రొయ్యలు పట్టుబడికి వచ్చే సమయానికి తుపాన్లు సంభ వించి ఆక్వా రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడంతో ప్రతికూల వాతావరణం నుంచి బయటపడాలని రేయింబవళ్లు చెరు వుల వద్దే కాపలా ఉంటున్నారు. ఇప్పటికే ఎకరానికి సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. మేత ధరలు, లీజు పెరగటంతో పాటు రొయ్యలకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆక్వా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి తరుణంలో తుపాను సంభవిస్తుందని వాతావరణ హెచ్చరికలతో ఆక్వా రైతుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి.మామిడికుదురు తుపాను ముప్పు పొంచి ఉందని హోచ్చరికలు జారీ చేయడం తో రైతులు అందోళనచెందుతున్నారు. జిల్లాలో 1.52లక్షల ఎకరాలలో ఖరీప్‌ వరి సాగు చేశారు. రామచంద్రపురం తుఫాను ప్రభావంతో ఈనెల 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.కోతల నిలిచిపోగాభారీ వర్షాలతో నేలకొరిగే ప్రమాదం పొంచి ఉంది. కోతలు వాయిదా వేసుకోవాలని, ధాన్యం రాశులపై టార్పాలిన్లను కప్పాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఉప్పలగుప్తం తుపాను ప్రభావంతో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. మండలంలో 5134 ఎకరాల్లో ఈసారి ఖరీఫ్‌ సాగు చేశారు. మండలంలో 1650 ఎకరాల్లో కోతలు పూర్తయినట్టు వ్యవసాయాధికారి జి.కుమార్‌ బాబు తెలిపారు.

 

➡️