తెలుగుజాతిని జాగృతం చేసిన ‘రాయప్రోలు’

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు జాతిని జాగృతం ఆంధ్రోద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు అని ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు. బుధవారం రాయప్రోలు సుబ్బారావు 132వ జయంతి సందర్భంగా పురపాలక ఉన్నత పాఠశాలలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సాయిబాబు మాట్లాడుతూ రాయప్రోలు కవిత్వంలో ఆంధ్రాభిమానం వెల్లువలా ప్రవహిస్తోంది. ప్రజలలో జాతీయ భావ జాగృతిని కలిగించిన వారిలో రాయప్రోలు అగ్ర గణ్యులన్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ ఎలుగెత్తి చాటారు. ఆంధ్రుల గత వైభవం ప్రధానంగా ఆయన రచనలు సాగించారు. తెలుగు తల్లి అనే భావనకు జీవం పోసి, బాపట్లను తెలుగు తల్లి పుట్టినిల్లుగా మార్చారు. తెలుగు భాషామ తల్లి కంఠంలో మల్లెపూదండ వేశారు. ఆ విధంగా ఆయన తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు. రాయప్రోలు సుబ్బారావు బాపట్ల వాసి కావడం, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేయడం బాపట్ల వాసులకు గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్‌ఎం వి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు సాంబశివరావు, నారాయణ, శ్రీనివాస్‌, మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️