దళితులను మోసం చేసింది జగనే

శింగరాయకొండ : దళితులను నమ్మించి మోసం చేసింది ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. స్థానిక పరిధిలోని అంబేద్కర్‌ నగర్‌లో మంగళ వారం రాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు వేల్పుల శింగయ్య, నాయకులు చీమకుర్తి కష్ణ, కూనపరెడ్డి వెంకట సుబ్బారావు, షేక్‌ సందాని బాషా, తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ సనావుల్లా, మందలపు గాంధీ చౌదరి, మించాల బ్రహ్మయ్య, సుదర్శి ప్రసాద్‌ రావు శీలం చంటి, షేక్‌ యస్‌ధాని, షేక్‌ గౌస్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️