ధాన్యం.. ధైన్యం.!

Jan 14,2024 20:31

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని 39 గ్రామ పంచాయతీలో 51 రెవెన్యూ గ్రామాలతో పాటు మరో 15 హేబిటేషన్‌ గ్రామాలు న్నాయి. 25 సచివాలయ పరిధిలో 22 రైతు భరోసా కేంద్రాలు న్నాయి. వాస్తవానికి రైతు పండించిన వరిని ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు అరకొరగానే చేస్తున్నట్లు తెలిస్తోంది. పైగా మిల్లర్లు దోపిడి పెరిగిపోవడంతో రైతు దిక్కుతోచక దళారుల వైపు మొగ్గు చూపుతున్నాడు. దీంతో దళారులు ఇష్టానుసారంగా రైతును దోచుకుంటున్నారు. మండలంలో ఆర్‌బికెల ద్వారా సేకరించిన ధాన్యాన్ని నాలుగు రైస్‌ మిల్లర్లకు తరలిస్తున్నారు. దీంతో రైతులు వద్ద నుంచి మిల్లర్లు అదనంగా క్వింటాకు నాలుగు నుంచి పది కేజీలు రైతుల వద్ద నుంచి దోచేస్తున్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి, తుఫాన్‌ ఒడిదుడుకులను తట్టుకొని వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని సరైన రేటుకు అమ్ముకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రాజాం, చీపురుపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ పట్టణాలకు లారీలు, ట్రాక్టర్లతో ఎగుమతి చేస్తున్నారు. దీంతో దళారులకు ధాన్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. హామీలు మాటలకే పరిమితంప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు రైతు భరోసా కేంద్రాలలో ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని ఊక దంపుడు ప్రసంగాలు చేశారు. ఆ దిశగా క్షేత్రస్థాయి అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతు ఏమి చేయని పరిస్థితిలో డీలాపడ్డాడు. ఇప్పటికే 40శాతం రైతు భరోసా కేంద్రాలు కొను గోలు చేస్తుంటే, మరో 50 శాతం దళారుల చెంతనే ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. దళా రులు కూడా క్వింటాకు 4 కేజీలు అదనంగా తీసుకుంటు న్నారని చెబుతున్నారు. అయితే దళారులు వారం రోజుల్లో ధాన్యం డబ్బు లు చెల్లిస్తున్నారని ప్రభుత్వానికి ఇస్తే సుమారు మూడు వారాలు పడుతుందని ఇప్పటికీ చాలా మంది డబ్బులు అందలేదనే ఆలోచ నతో కూడా దళారులకు ఇచేస్తున్నామని రైతులు చెబుతున్నారు. కౌలు రైతులకు ఇంకా నష్టంవాస్తవానికి చాలా మంది కౌలు రైతులు భూ యజమాని వద్ద ఎకరానికి 12 నుంచి 14 బస్తాల వరకు ఇస్తామని భూమిని కౌలుకు తీసుకున్నారు. తుపాను ప్రభావం, మదుపులు పెరిగిపోయాయి. పైగా దిగిబడి తగ్గిపోయింది. ఇప్పుడు ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ఒకవేళ ధాన్యం కొనుగోలు చేసినా మిల్లర్లు ఆదనంగా ధాన్యం తీసుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది కౌలు రైతులు కూడా దళారులకే ధాన్యాన్ని అమ్మేస్తున్నారు. దళారులు ప్రభుత్వం ధర కన్నా క్వింటాకు రూ.200 నుంచి రూ.300 తక్కువకు తీసుకుంటున్నారు. దీంతో అప్పుల పాలవుతున్నామని కౌలు రైతులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని, అదనంగా వసూలు చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️