నగర పంచాయతీలో జెఎఎస్‌ శిబిరం

Feb 7,2024 20:33

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీ పరిధి పద్మశాలి వీధి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. డాక్టర్లు దక్షయ, చంద్ర మౌళి, తిరుమలదేవి, టి.రమణమ్మ రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మెన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, వైసిపి పట్టణ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, నగర పంచాయతీ కమీషనర్‌ పి.బాలాజీ ప్రసాద్‌, వార్డు కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, బోర్డు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం పరిశీలన బొబ్బిలి: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలతో పేదలకు మేలు జరుగుతోందని బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణారావు అన్నారు. పట్టణంలోని కంచరవీధి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌-2 శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. వైద్యులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మొదటి విడత కార్యక్రమం విజయవంతం కావడంతోనే రెండో విడత జెఎఎస్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించి ందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళీకృష్ణారావు, వైసిపి పట్టణ అధ్యక్షులు చొడిగింజల రమేష్‌ నాయుడు, కౌన్సిలర్‌ బొత్స రమణమ్మ, వైసిపి నాయకులు ముగుది మురళీ, మున్సిపల్‌ టిపిఆర్‌ఒ జగన్మోహన్‌ రావు, వైద్య సిబ్బంది, సచివాలయం కన్వీనర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️