నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి

Feb 21,2024 18:56

స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు
ప్రజాశక్తి – వినుకొండ :
స్టేడియం పేరుతో గంగినేని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణంతో జరిగిన నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకొని అవినీతి సొమ్మును రికవరీ చేయాలని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టిడిపి-జనసేన ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. జీవీ ఆంజనే యులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కె.నాగ శ్రీను రాయల్‌ మాట్లాడుతూ స్టేడియానికి స్థలం కేటాయింపు, ఉన్నత విద్యశాఖ అనుమతి లేకుండా రూ.1.80 కోట్లతో ప్రహరీ కట్టి దాన్ని స్టేడియం అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు పెట్టుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించాల్సిన జిల్లా మినరల్‌ ఫండ్‌ (డిఎంఎఫ్‌) రూ.కోటిని దుర్వినియోగం చేశారన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి వినకొండకు వచ్చిన సమయంలో వైయ స్సార్‌ స్టేడియంగా బ్యానర్‌ కట్టి సిఎం ఊరు దాటగానే పేరు మార్చుకున్నారని అన్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం సమయంలో వచ్చిన మట్టిని స్టేడియంలో నింపి ఎమ్మెల్యే రూ.లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. స్టేడియంలో పిచ్చి చెట్లు తప్ప క్రీడాకోర్టులు లేవన్నారు. రానున్న టిడిపి – జనసేన ప్రభుత్వంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేసి, ఎన్‌ఎస్పీ స్థలంలో స్టేడియంను నిర్మిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు షమీంఖాన్‌, సురేష్‌బాబు, పూర్ణచంద్రరావు, కోటేశ్వరరావు, అభిమన్యు, అనిల్‌కుమార్‌, మణికంఠ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని, ఈనాడు కార్యాలయంపై దాడిని జీవీ ఆంజనేయులు విలేకర్ల సమావేశంలో ఖండించారు. వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రౌడీఇజాన్ని ప్రోత్సహి స్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ టిడిపి బ్యానర్లు చించి వేయించారని, టిడిపి హయాంలో అభివృద్ధి పనుల శిలాఫ లకాలనూ ధ్వంసం చేయించి అల్లర్లను రెచ్చగొడు తున్నారని విమర్శించారు. బ్యానర్లు చించి. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రి నిర్మించకుండానే 100 పడకల ఆసుపత్రి నిర్మించామని ఎమ్మెల్యే ఊదరగొ ట్టడం హాస్యాస్పదమన్నారు. వరికపూడిశెల నిర్మాణ యోచన వైసిపికి లేదని, టిడిపితోనే సాధ్యమని అన్నారు.

➡️