నేడు మదనపల్లికి చంద్రబాబు నాయుడు.. సిఎఎ, ఎన్‌ఆర్‌సి పట్ల స్పష్టతనిచ్చే అవకాశంరాజంపేట నుంచి భారీగా సమీకరణ

ప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి ఎన్నికల ప్రచా రానికి శ్రీకారం చుట్టింది. టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయం త్రం మదనపల్లి పట్టణంలో నిర్వహించనున్న ప్రజాగళం సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అన్న మయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాల టిడిపి నాయ కత్వం స్థానిక బెంగళూరు బస్టాండులో ప్రజాగళం సభకు ఏర్పాట్లు చేసింది. మొదటగా ముస్లిం సోదరులతో కలిసి ఇప్తార్‌ విందును స్వీకరించిన అనం తరం ప్రసంగించనున్నారు. జిల్లాలో ముస్లిముల భయాం దోళనల్ని తొల గించే ప్రయత్నం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే అవ కాశం ఉన్నట్లు టిడిపి వర్గాల అభిజ్ఞా. ఇటీవల కేంద్రంలోని బిజెపి సర్కారు తెచ్చిన సిఎఎ, ఎన్‌ఆర్‌సి చట్టాల పట్ల ముస్లిముల్లో నెలకొన్న భయా ందోళనలపై స్పష్టత ఇచ్చే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆరు నియోజక వర్గాల్లో ఐదు అసెంబ్లీ, రాజంపేట ఎంపీ టిక్కెట్లపై స్పష్టత ఇవ్వడాన్ని మినహాయిస్తే రాజంపేట అభ్యర్థిత్వం తేలని నేపథ్యంలో బిజెపి, జనసేన, టిడిపి అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజంపేట టికెట్‌ ఆశా వహులు పెద్దఎత్తున జన సమీకరణ ద్వారా బలం నిరూపించే ప్రయత్నాల్లో నిమగమ య్యారు. రాజంపేట అసెంబ్లీ టికెట్‌ కోసం పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రచారం జరిగిన సుగవాసి బాలసుబ్రమణ్యం కోరు తున్నట్లు సమాచారం. బత్యాల చెంగల్రాయులు, జగన్మోహన్‌రాజులతోపాటు సుగవాసి బాలసుబ్రమణ్యం సైతం టికెట్‌ రేసులో నిలిచినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

➡️