నేత్ర రోగులకు వరం…

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : స్థానిక జిల్లా కేంద్రాసుపత్రిలో నేత్రవైద్య విభాగానికి రోజురోజుకు ఎనలేని ఆదరణ లభిస్తోంది. గతంలో నేత్రవైద్యానికి సంబంధించిన ఆపరేషన్లు, చికిత్సల కోసం విజయనగరం, విశాఖపట్నంలో గల ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తిస్ధాయిలో కేంద్రాసుపత్రిలో వైద్యుల నియామకం జరగడంతో పాటుగా అందుకు సంబంధించిన పరికరాలు, ఆపరేషన్‌ థియేటర్‌, యంత్ర పరికరాలు ఏర్పాటు కావడంతో, రోజురోజు నేత్రవ్యాధులకు సంబంధించిన రోగులు ఓపిలో పరీక్షలు చేయించుకునేందుకు ఎక్కువగా తరలివస్తున్నారు. కంటి అపరేషన్లు కూడా పార్వతీపురం కేంద్రాసుపత్రిలో చేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని స్థానిక వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రతి రోజు ఓపి విభాగంలో ఆధునిక యంత్రాలతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. గ్లూకోమా, కాటరాక్ట్‌తో చిన్న, చిన్న మైనర్‌ ఆపరేషన్లు నిర్వహించడం, నీటికాసులు, కంటిపొరలు, రెప్పల్లో చీము వంటి సమస్యలతో ఎక్కువగా రోగులు వస్తున్నారని, వీరికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఆసుపత్రిలో ఈ విభాగం ఏర్పాటైందని తెలియక ఇప్పటికీ పరిసర ప్రాంత ప్రజలు ప్రైవేటు కంటి ఆసుపత్రి వారు నిర్వహించే క్యాంపులకు హజరై ఆయా అసుపత్రలకు తరలివెళుతున్నారని, దీనిపై విస్తృతంగా ప్రచారం జరగాలని ఆసుపత్రి వైద్యులు కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి, ఇహెచ్‌ఎస్‌ వారికి కూడా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ విభాగంలో నేత్ర వైద్యం కోసం వచ్చే వారు తమతో పాటు తప్పక ఆధార్‌కార్డును తీసుకురావాలని కోరారు. ఉచితంగానే ఆధునిక నేత్రవైద్యంపార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో నేత్రవైద్య విభాగానికి రోజురోజు ఆదరణ పెరుగుతుంది. అందుకు కారణం ఇక్కడ విలువైన నేత్ర పరీక్షలతో పాటు, స్థానికంగానే ఆపరేషన్లు కూడా నిర్వహించడమే. గిరిజన గ్రామ ప్రాంతాల వారు కంటి సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు. వీరికి విలువైన సేవలు స్థానికంగానే అందడంతో రోగుల సంఖ్య పెరగడానికి కారణం. కె.సుకుమార్‌ బాబు,జిల్లా అంధత్వ నివారణ ప్రాజెక్టు అధికారి.ఆరోగ్యశ్రీ, ఇహెచ్‌ఎస్‌ కార్డులు ఉన్న వారికి స్థానికంగానే శస్త్ర చికిత్సలుప్రైవేటు ఆసుపత్రుల్లో మాదిరిగానే జిల్లా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచితంగా విలువైన కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నాం. కళ్లద్దాల పంపిణీకి మరికొద్దిరోజులు పడుతుంది. ఆసుపత్రిలోని సేవలపై అవగాహన పెంచుకుని రోగులు సేవలు వినియోగించుకోవాలి.కె.సూర్యమాల, అప్తాలమాలజిస్టు, సివిల్‌సర్జన్‌.

➡️