నోటీసులతో కుప్పకూలిన అంగన్వాడీ

ప్రజాశక్తి-తాడేపల్లి : ఒకపక్క ఎసిడిపిఒ ఒత్తిడి, మరోపక్క సూపర్‌వైజర్ల బెదిరింపులు దీనికి తోడు గురువారం వెంటనే విధులకు హాజరుకావాలని నోటీసుల నేపథ్యంలో పట్టణంలోని కెఎల్‌రావు కాలనీ హోసన్న మందిరం వద్ద గల అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న సీతానగరానికికు చెందిన కమలకుమారి కుప్పకూలి కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐసిడిఎస్‌లో కొంతమంది విధులకు హాజరుకాకపోతే జైలుకు పోతారని, ఉద్యోగాల నుంచి తొలగిస్తారని వివిధ రకాల బెదిరింపుల వల్ల కమలకుమారి అనారోగ్యానికి గురయ్యారు. అధికారులు ఇప్పటికైనా అంగన్‌వాడీలు కోరుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం, బెదిరింపులు, నోటీసులతో అంగన్‌వాడీలను భయపెట్టడం సరైనది కాదని నాయకులు అన్నారు.

➡️