పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Mar 17,2024 20:55

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని సంకిలి, లక్ష్యంపురం, రేగిడి, అంబాడ వెంకటాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైందని ఎంఇఒ ఎం.వర ప్రసాద్‌ రావు తెలిపారు. ఇప్పుటికే అన్ని పరీక్షా కేంద్రాలకు మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. సంకిలి పరీక్ష కేంద్రంలో 112మంది, రేగిడి కేంద్రంలో 159, లక్ష్యంపురంలో 135, అంబాడ వెంకటాపురంలో 190 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. లక్కవరపుకోట: మండలంలోని వివిధ పాఠశాలలో చదువుతున్న 515 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. చందులూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి 58 మంది, కొట్యాడ 74 , గంగుబూడి 52 , ఏపీ మోడల్‌ స్కూల్‌ 81 , కేజీబీవీ 47 , గొల్జాం 73 , లక్కవరపుకోట 66, శ్రీచైతన్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల నుండి 29మందితో పాటు కొత్తవలస మండలానికి చెందిన జ్యోతిరావు పూలే బాలికల ఆశ్రమ పాఠశాల నుండి 35 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కల్లేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఈ మండలానికి చెందినప్పటికీ అక్కడ చదువుతున్న 38 మంది విద్యార్థులు వియ్యంపేటలో రాయనున్నారు. ఈ 515 మంది విద్యార్థులకు ఎల్‌ కోట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్‌ స్కూల్‌లను పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు 53 మంది ఇన్విజిలేటర్లను డిఇఒ నియమించినట్లు స్థానిక ఎంఇఒలు సిహెచ్‌ కూర్మారావు, శ్రీనివాసరావులు వెల్లడించారు.

➡️