పలు చోట్ల సిఎం జన్మదిన వేడుకలు

ప్రజాశక్తి- బొబ్బిలి : రాష్ట్రంలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో గురువారం సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకృష్ణ, నాయకులు శంబంగి వేణుగోపాలనాయుడు, వైసిపి పట్టణ అద్యక్షులు చోడిగంజి రమేష్‌ నాయుడు, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.చీపురుపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోన్‌ రెడ్డ పుట్టిన రోజు వేడుకలు మండల వైసిపి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, స్థానిక ఎంపిపి ఇప్పిలి వెంకటనర్శమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, చీపురుపల్లి సర్పంచ్‌ మంగళగిరి సుధారాణిలతో కలసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వైసిపి నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృధ్దాశ్రమంలో ఉన్న వృధ్దులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు ఇప్పిలి అనంతం, జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి వలి రెడ్డి శ్రీనివాస నాయుడు, పట్టణ వైసిపి అధ్యక్షులు పతివాడ రాజారావు, పాల్గొన్నారు.మెంటాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వైసిపి మండల అధ్యక్షులు రాయిపిల్లి రామారావు, ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు అన్నారు. మండల పరిషత్‌ సమావేశ భవనంలో జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం నిర్వహించారు. ముందుగా పిట్టాడ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసారు. అనంతరం మండల కాంప్లెక్స్‌ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు సారికి ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ, సర్పంచుల సంఘ అధ్యక్షులు రేగిడి రాంబాబు, పాల్గొన్నారు. గజపతినగరం: సిఎం జన్మదిన వేడుకలను ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్‌పిటిసి గార తవుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమక్షంలో జన్మదిన కేకును కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. భోగాపురం: స్థానిక మండలం పరిషత్‌ కార్యాలయం వద్ద సిఎం పుట్టిన రోజు సందర్భంగా వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపిపి ఉప్పాడ అనూష రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఏ రాయివలస పంచాయతీ కార్యాలయం వద్ద జగన్మోహన్‌ రెడ్డి 51 పుట్టినరోజు సందర్భంగా 51కేజిల కేకును రాష్ట్ర హౌసింగ్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి కట్‌ చేశారు. భోగాపురం పంచాయతీ కార్యాలయం వద్ద వైకాపా నాయకులు కందుల రఘుబాబు కేక్‌ని కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభోసన రావు, బైరెడ్డి ఎర్రప్పల నారాయణ, సుందర హరీష్‌, పడాల శ్రీనివాసరావు, భాను, ఉప్పాడ విజయభాస్కర్‌ రెడ్డి, వాసుపల్లి రెయ్యుడు, పాల్గొన్నారు.ఆకుల పేటలో దుప్పట్లు పంపిణీడెంకాడ: సిఎం పుట్టినరోజు వేడుకలు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో పార్టీ అధ్యక్షుడు ఎంపిపి బంటుపల్లి వెంకట్‌ వాసుదేవరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు, 51 కేజీ కేకును కట్‌ చేసి శుభాకాంక్షల తెలిపారు. ఆకులపేటలో సర్పంచ్‌ సువ్వాడ రమేష్‌ పలువురు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ రొంగలి కనక సింహాచలం, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.కొత్తవలస: సిఎం పుట్టిన రోజు వేడుకలను స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వై. పద్మజ, ఎంఇఒలు జి. శ్రీదేవి, బి.శ్రీనివాసరావులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.శృంగవరపుకోట: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పట్టణంలోని దేవి గుడి జక్షన్‌ వద్ద ఉన్న వైయస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి పండ్లు, రొట్టేలు పంపినీ చేశారు. అనంతరం ఎస్‌.కోట ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్స్‌ పంపినీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజరు కుమార్‌, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ, స్టేట్‌ ఫోక్‌ అండ్‌ కల్చరల్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, కూనిరెడ్డి వెంకటరావు, గట్రెడ్డి పైడితల్లి, వీరనారాయణం సోంబాబు, వార్డు సభ్యులు మజ్జి శేఖర్‌, చింతల నారాయణమూర్తి, ఎలమంచిలి అప్పారావు, పాల్గొన్నారు. విజయనగరం టౌన్‌: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. వైసిపి నగర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి కేకు కట్‌చేసి అందరికీ పంచిపెట్టారు. నిరుపేద వికలాంగులకు బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వి రాజేష్‌, వైసిపి నగర అధ్యక్షులు ఆశపు వేణు మాట్లాడారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, ఎంపిపి మామిడి అప్పలనాయుడు, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చులయ యాదవ్‌, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పాల్గొన్నారు.

➡️