పాఠశాలల ఆకస్మిక పరిశీలన

ప్రజాశక్తి – పూసపాటిరేగ విద్యార్థుల సామర్థ్యాలు, ఉపాద్యాయుల పనితీరుపై విద్యాశాఖాధికారులు గురువారం మండలంలో పలు పాఠశాలలో ఆకస్మిక పరిశీలన చేశారు. జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు రెండు బృందాలు ఈ పరిశీలనలో పాల్గొన్నాయి. ఇందులో పాఠశాలలోని ప్రతి విద్యార్థిని యొక్క తరగతుల వారిగా తెలుగు, ఆంగ్ల భాషలు, గణిత అంశాలలోని సామర్థ్యాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, సాధన పుస్తకాలు రాసే విధానాన్ని వాటిని ఉపాద్యాయులు పరిశీలించి సరిదిద్దుతున్న తీరును కూడా పరిశీలన బృందం పరిశీలించింది. ఈ అంశాల ఆధారంగా విద్యార్థులకు, ఉపాద్యాయులకు, పాఠశాలకు గ్రేడులు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఉపాద్యాయులకు పలు సూచనలను చేశారు. మండల విద్యశాఖాధికారి బి. పాపినాయుడు, భోగాపురం మోడల్‌ స్కూల్‌ ఇన్చార్జ్‌ ప్రిన్సిపాల్‌ బి. ధుర్గాప్రసాద్‌ బృందం స్థానిక ప్రాథమిక పాఠశాలతో పాటు లంకలపల్లి పాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించగా గజపతినగరం మండల విద్యాశాఖాధికారి బి. సాయి చక్రధర్‌, డెంకాడ మండలం మోపాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయులు సిహెచ్‌. నాగ్‌ కుమార్‌ బృందం రెల్లివలస-1, బొర్రవానిపాలెం ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మండలంలో అన్ని పాఠశాలల్లోనూ ఈ ఆకస్మిక పరిశీలనలు కొనసాగుతాయని అధికారులు తెలియజేశారు. వేపాడ: మండలంలోని గుడివాడ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖకు సంబంధించిన బృందం గురువారం పరిశీలించింది.ఉపాధ్యాయులు ఇంతవరకు బోధించిన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులను పాఠాలు చదివించడం, వర్క్‌ బుక్కులు పరిశీలన చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో సిఆర్‌పి కాటేపల్లి రాంప్రసాద్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️