‘పాత పెన్షన్‌ పై టి.డి.పి. స్టాండ్‌ చెప్పాలి’

క్రోసూరు : గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రకాలుగా నిరసనలు ధర్నాలు చేస్తూ కనిపించిన రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను కలిసి అనేక వినతిపత్రాలు ఇచ్చి సి.పి.ఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌ని ఆంధ్రప్రదేశ్‌్‌ ఉద్యోగులకు వర్తింపజేయాలని, ఇప్పటికే ఆరు రాష్ట్రాలలో పాత పెన్షన్‌ తిరిగి అమలు చేస్తున్న విషయం గుర్తుచేస్తూ ప్రతిపక్ష నాయకులకు విన్నపాలు చేస్తున్నారు. పాత పెన్షన్‌ పై తమ పార్టీ స్టాండ్‌ చెప్పాలని, మేనిఫెస్టోలో పెట్టాలని కోరుతూ ఎ.పి.సి.పి.ఎస్‌.ఇ.ఎ. యూనియన్‌ పిలుపు మేరకు ఆదివారం నరసరావుపేట నియోజకవర్గం ఎంపి లావు శ్రీకష్ణ దేవరాయలుని అయన పార్టీ ఆఫీసులో కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో పల్నాడు జిల్లా జనరల్‌ సెక్రటరీ శ్రీ పోలూరి పిచ్చయ్య, గౌరవ సలహాదారుడు శ్రీ తూమాటి శరత్‌ కుమార్‌, నీలం చంద్రం, అయ్యప్పస్వామి పాల్గొన్నారు.

➡️