పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు

ప్రజాశక్తి-వెలిగండ్ల : కష్ట కాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. టిడిపి మండల విస్తతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకట్రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. కనిగిరి ప్రాంతం అభివద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకుయ వివరించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్యామల కాశిరెడ్డి, దొడ్డ వెంకటసుబ్బారెడ్డి, టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనా ప్రతాప్‌, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గవదగట్ల హరికష్ణ, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు కర్నాటి భాస్కర్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి, తెలుగు రైతు అధ్యక్షుడు మీనిగా కాశయ్య, కారంపూడి వెంకటేశ్వర్లు, చిలకల కష్ణారెడ్డి, వెంకట సుబ్బారావు,షేక్‌ మజాహర్‌, మనోహర్‌, రాజగోపాల్‌, రాజశేఖర్‌ రెడ్డి, కేసరి రమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️