పిల్లి ఏసు సేవలు చిరస్మరణీయం

Nov 29,2023 22:49 #CITU, #pilli yesu, #y.netaji

 కొల్లిపర: కొల్లిపర మండల గ్రామ సేవకుల సంఘం గౌరవా ధ్యక్షులు పిల్లి ఏసు బుధవారం మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వై.నేతాజీ , సిఐ టియు జిల్లా నాయకులు భావనారాయణ, సిఐ టియు మండల నాయకులు కోటా చంద్రశేఖర్‌, తహ శీల్దార్‌ నాంచారయ్య, ఆర్‌ఐ శ్రీనివాసరావు, గ్రామ సేవ కుల సంఘం జిల్లా ఉపా ధ్యక్షులు జాల రమేష్‌ కొరకంటి సంగయ్య, గ్రామ సేవకుల సం ఘం మండల అధ్యక్షులు అయ్యర్పాల్‌, తెనాలి సంఘం అధ్య క్షులు కిరణ్‌ కుమార్‌ సుధాకర్‌, సత్యవతి, సుజాత సీతయ్య పరా మర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏసు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. గత 45 సంవత్స రాలుగా గ్రామ సేవకునిగా పనిచేసి వివిధ పదవులు పొందిన ఏసు సేవలను పలువురు కొనియాడారు.

➡️