పుష్కరిణిలో గంగా హారతి

 ప్రజాశక్తి-సింహాచలం: సింహాచల దేవస్థానం వరాహ పుష్కరిణిలో గంగా హారతి కార్యక్రమాన్ని భక్తుల కోలాహాల మధ్య అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. కొండ దిగువ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో తిరువీధి నిర్వహించారు. పుష్కరిణి వద్ద ఉంచి ప్రత్యేక పూజల అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రాక అనంతరం నది హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. నదిహారతి వెలిగించే విధంగా భక్తులందరికీ దీప కుందులను, దీపాన్ని దేవస్థానం సిబ్బంది అందజేశారు. దర్శన అనంతరం భక్తులకు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని సిబ్బంది అందజేశారు. దేవస్థానం ఈవో సింగాల శ్రీనివాసమూర్తి దంపతులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, దేవస్థానం సిబ్బంది గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాంస్కృతిక కళాకారులను ఈవో సన్మానించారు.

➡️