పెండింగ్‌ పనులను పరుగులు పెట్టిస్తాం

ప్రజాశక్తి – కడపప్రతినిధిఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల్ని పరుగులు పెట్టిస్తాం. రూ.400 కోట్లతో మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రయత్నం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాల్లోని చిన్న, మధ్యతరహా, భారీ సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో తక్కువ వ్యయంతో కూడిన డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాం. జికెఎల్‌ఐ పరిధి లోని డ్రిప్‌ ఇరిగేషన్‌ పనుల్లో భాగంగా చేపట్టిన 900 సంపు ల్లో 85 సంపుల నిర్మాణ పనుల పూర్తి చేశాం. అనం తరం ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద దైన మొగమేరు అక్వి డక్ట్‌ను పూర్తి చేయడంపై దృష్టి సారించామని గాలేరు – నగరి సుజల స్రవంతి పథకం సూపరి ంటెండింగ్‌ ఇంజినీర్‌ ఎం.మల్లికార్జునరెడ్డితో ముఖాముఖి…అదనపు ఆయకట్టు వివరాలు తెలపండి? ఉమ్మడి జిల్లాలో సుమారు ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు సాగయోగ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలో అదనపు ఆయకట్టుకు నీరందిం చడంపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా 2024 డిసెంబర్‌ నాటికి జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని సర్వరాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టుల పరిధిలోని 30 వేల ఎకరాలకు సాగునీటిని అందించే దిశగా దృష్టి సారించింది.జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల వివరాలు?జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో ఆరు చిన్న, మధ్యతరహా, భారీ సాగు నీటి ప్రాజెక్టులున్నాయి. ఇందులో ఒకటి భారీ, ఐదు మధ్య తరహా ప్రాజెక్టులున్నాయి. గండికోట, వామికొండ, సర్వరాయసాగర్‌, పైడిపాలెం, మైలవరం, సిబిఆర్‌ ప్రాజెక్టులున్నాయి.ప్రాజెక్టుల నీటి నిల్వ పరిమాణమెంత? జిఎన్‌ఎస్‌ఎస్‌ సాగునీటి ప్రాజెక్టులు 54.489 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 23 టిఎంసిలు నిల్వ ఉన్నాయి.డిస్ట్రిబ్యూటరీ పనుల వివరాలు తెలపండి? జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో ఫేజ్‌-2లోని ప్యాకేజీ-1, ప్యాకేజీ -2, ప్యాకేజీ-3 పరిధిలోని గండికోట, సర్వరాయసాగర్‌, వామికొండ తదితర రిజర్వా యర్ల పరిధిలో భూసేకరణ ప్రక్రియ నడుస్తోంది. 372 కిలోమీటర్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ.400 కోట్ల వ్యయంతో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని టెయిలెండ్‌ వరకు నీటిని అందించే అవకాశం ఉంది.అదనపు ఆయకట్టు గురించి మాట్లాడండి? జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలకు రూ.200 నుంచి రూ.400 కోట్లు విడుదల చేస్తే జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల్లో మూడు లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని అందిస్తాం. ఇందులో పులివెందుల నియోజకవర్గ పరిధిలోనే 1.66 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంది. మిగిలిన తెలుగుంగ ప్రాజెక్టుల పరిధిలో అదనపు ఆయకట్టు అందు బాటులోకి వచ్చే అవకాశం ఉంది. పులి వెందుల పరిధిలోని 1.65 లక్షల ఎకరాల్లో 1.25 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్‌ కింద అందుబాటులోకి వస్తుంది. ఈమేరకు పిబిసి, మైలవరం, 350 కి.మీ, జికెఎల్‌ఐ కింద 70 కి.మీ మేర చిన్న కాలువలు, పంట కాలువలను పూర్తి చేయడం ద్వారా 30 వేల ఎకరాలకు, పిబిసి కింద 55,500 ఎకరాలకు గానూ 40 వేల ఎకరాలకు నీళ్లను అందించడం జరిగింది. జూన్‌ నాటికి మిగి లిన ఆయ కట్టుకు నీరందిస్తాం.ఫేజ్‌-2లోని నాలుగవ ప్యాకేజీ గురించి వివరించండి? జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లోని నాలుగో ప్యాకేజీకి ఫారెస్టు సమస్య ఎదురవుతోంది.119 కిలోమీటర్‌ నుంచి 240 కిలోమీటర్‌ వరకు నాలుగో ప్యాకేజీ ఉంటోంది. ఇందుకు 2500-2800 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇందుకుగానూ రూ.2,550 కోట్లు ఫారెస్టు డిపార్టుమెంట్‌కు చెల్లించాల్సి ఉంది.సర్వరాయసాగర్‌ లీకేజీ పనుల సంగతేమిటి? రూ.212 కోట్లతో సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టాం. లీకేజీ పనులకు సంబంధించి రూ.12.10 కోట్లు, వామికొండ కింద రూ.8 కోట్ల వ్యయంతో కూడిన పనులు ప్రారంభించడమైంది. ప్రతిపాదనలు పంపించడమైంది. డిసెంబర్‌ నాటికి రిజర్వాయర్‌ కట్ట కింది భాగంలో నీటి లీకేజీని అరి కట్టడానికి అత్యాధునిక సాంకేతికతో గ్రౌటింగ్‌ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాం.మైక్రో ఇరిగేషన్‌ పనుల తీరుతెన్నుల గురించి వివరించండి? రూ.1260 కోట్లతో డ్రిప్‌ ఇరిగేషన్‌ చేపట్టడమైంది. జికెఎల్‌ఐ పరిధిలోని 800 సంపుల్లో ఇప్పటికి 120 సంపులు పూర్తి చేయడమైంది. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి సారిం చాం. ఎల్‌ఎ సంబంధించిన సమస్య కొనసాగుతు న్నందున ఆలస్యంగా సాగుతోంది. ఏదేమై నప్పటికీ సాధ్యమైన మేరకు త్వరితగతిన పూర్తి చేయ డానికి ప్రాధాన్యత ఇచ్చాం. మైలవరం రిజర్వాయర్ల కట్టల పునరుద్ధరణ ఎప్పుడో? గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కురిసిన అధిక వర్షాలు ధాటికి పోటెత్తిన వరదల కారణంగా మైలవరం, చిత్రావతి రిజర్వాయర్ల కట్టలు కుంగిన మాట వాస్త వమే. వీటి పునరుద్ధరణకు సంబందించి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మైల వరం మరమ్మతులకు రూ.83 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడమే ఆలస్యం.కాలేటివాగు ప్రాజెక్టు పురోగతిని వివరించండి? 2025 మార్చి నాటికి కాలేటివాగు పనుల్ని పూర్తి చేస్తాం. పిఎల్‌ఆర్‌ కాంట్రాక్టు సంస్థ రూ.50030 కోట్లతో టెండరును దక్కించుకుంది. రూ.4,300 కోట్ల పనుల్లో ఇప్పటి వరకు 30 శాతం పనులు చేపట్టింది. కడప జిల్లాలో 40 వేలు, అన్నమయ్య జిల్లాలో లక్ష ఎకరాలు, చిత్తూరు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలు వెరసి 2.90 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది. చిత్రావతి-ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల పురోగతి తెలపండి? రూ.850 కోట్లతో చిత్రావతి- ఎర్రబలి ఎత్తిపోతల పనులు చేప ట్టాం. రూ.250 కోట్ల మేర పనులు పూర్తి చేశాం. రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ చేయాల్సి ఉంది. ఇందులో వేముల, వేంపల్లి ప్రాం తాల్లోని ఆరు చెరువులను నింపాల్సి ఉంది. అనంతరం వేంపల్లిలోని గిడ్డం గివారిపల్లి చెరువును నీటిని సరఫరా చేయడం ద్వారా 10 వేల ఎకరాల అదనపు ఆయకట్టు లభించే అవకాశం ఉంది. ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల వల్ల యుసిఐఎల్‌ పరిధిలోని ఆరు నిర్వాసిత గ్రామాలకు శుద్ధ జలాన్ని అందిస్తాం.రాయలసీమ డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది? రాయలసీమ డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేశాం. సుమారు రూ.ఎనిమిది వేల కోట్లతో పనుల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లాలో రూ.500 కోట్లతో జిఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ, రూ.650 కోట్లతో గండికోట లిఫ్టు స్కీమ్‌ పను లతోపాటు మరో రూ.350 కోట్ల తో ఇతర పనుల్ని చేపట్టడం జరిగింది. ఈలెక్కన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.

➡️