పేదల ఇళ్లు కూల్చివేతకు యత్నం

ప్రజాశక్తి-పోరుమామిళ్ల మండలంలోని జి.బి.నగర్‌ కాలనీలో సుమారు 20 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ అధికారులు బుధవారం జెసిబిలతో అక్రమంగా కూల్చివేసేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు, సిపిఎం నాయకులు అడ్డుకున్నారు. మహిళలు, వృద్ధులు ఇళ్లు కూల్చవద్దని, తమను నిరాశ్రయులను చేయవద్దంటూ రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. తహశీల్దార్‌ గంగయ్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి భైరవప్రసాద్‌ పేర్కొన్నారు. గతంలో రూ.50 లక్షల పేదలకు నష్టం కలిగించారన్నారు. 20 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నామని తహశీల్దార్‌కు పేదలు మొరపెట్టుకున్నా వినుపించుకోకుండా విఆర్‌ఎలు అందరిని పంపించి జెసిబి వాళ్లే స్వయంగా విఆర్‌ఎలు తెచ్చి పేదల ఇండ్లను కూల్చేందుకు ప్రయత్నించారన్నారు. జెసిబి ఎందుకు తెచ్చారని ప్రశ్నించాగా విఆర్‌ఎలకు ఈ స్థలం కావాలి తహశీల్దార్‌ జెసిబితో చదును చేసుకోమన్నారని, తమకు ఇంటి పట్టాలు ఇస్తారని కాలనీ వాసులతో గొడవ పడ్డారన్నారు. ఎన్నికల ముందు వైసిపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేదానికి పూనుకున్నారన్నారు. 100 ఎకరాలు బినామీ పేర్లతో ఉన్న డికెటి భూములను రంగసముద్రం పంచాయతీలో దోచుకుంటుంటే వాటిని వదిలేసి పేదలేసుకొని జీవనం చేసుకుంటూ ఉన్నటువంటి కాలనీలో దుర్మార్గంగా తహశీల్దార్‌ వ్యవహరిస్తున్నారన్నారు. తహశీల్దార్‌ గతంలో నందలూరులో పనిచేసేటప్పుడు 30 ఎకరాలు భూమి ఆన్‌లైన్‌లో ఎక్కించుకొని రిజిస్టర్‌ చేపించుకొని బినామీ పేర్లతో అమ్ముకున్నాడని విమర్శించారు. స్థలాల రూపంలో ఆక్రమానికి ముందు ఉంటారన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ రూపంలో పెద్ద ఎత్తున చేతులు తడిపాడని మండల ప్రజలు వాపోతున్నారని పేర్కొన్నారు. తహశీల్దార్‌ ఇప్పటికైనా ఆలోచించి పేదల పక్ష నిలబడి వాళ్లకు పట్టాల మంజూరు చేయాలన్నారు. సిపిఎం కాలనీ పక్కనే 30 ఎకరాలు భూమి ఉంది. ఆ స్థలంలో పట్టాలు మంజూరు చేసుకోవచ్చన్నారు. అలాంటి స్థలాన్ని వదిలిపెట్టి సిపిఎం కాలనీలోనే పేదల ఇల్లు కూల్చి పట్టాల మంజూరు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. లేని పక్షంలో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ఆమరణ నిరాదీక్ష కూర్చుంటామని హెచ్చరించారు.

➡️