పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది – ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

ప్రజాశక్తి-కడప ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. బుధవారం స్థానిక గోకుల్‌ సర్కిల్‌ వద్ద 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని నగర మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎం.రామ చంద్రారెడ్డిలతో కలిసి అంజాద్‌బాషా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదష్టంగా భావిస్తున్నానన్నారు. కడప నగరాభివద్ధిలో భాగంగా ఎన్నడూ లేని, ఎవరూ ఆలోచించలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగర రూపురేఖలు మార్చే అంశంలో అనేక అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సురేష్‌బాబు మాట్లాడుతూ నగరాన్ని రూ.2500 కోట్లతో అభివద్ధి చేశామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అభివద్ధి జరగలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎం.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వంలోని అభివద్ధి సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ పులి సునీల్‌కుమార్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర, ఆర్యవైశ్య సంఘం గుప్ప చంద్రశేఖర్‌, మునగ శ్రీనివాసులు యనమల రమణయ్య, ముల్లంగి కృష్ణమూర్తి, పలుకు సుబ్బరాయుడు, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జయచంద్రారెడ్డి, సుభాన్‌బాషా, పస్తం అంజి, సిహెచ్‌ సునీల్‌ కుమార్‌, అబ్దుల్‌ రౌఫ్‌, సుబ్బమ్మ, నసీమా సుల్తాన్‌ పాల్గొన్నారు.

➡️