పొట్టి శ్రీరాములు, స్వామి వివేకానంద విగ్రహాలు ఆవిష్కరణ

Mar 3,2024 15:51 #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహానీయుల స్మరణ మరువరాదని వారు నిత్యం మన కళ్ళముందు ఉండడం మంచిదని డెప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. వుడా కాలనీ ఆర్యవైశ్య సేవాసంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ప్రారంభోత్సవ కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారని, తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. అలాగే స్వామి వివేకానంద యుక్త వయసులోనే వేదాంత,యోగ తత్వ శాస్త్రాలు క్షుణ్ణంగా పరిశీలించారని, వారి ప్రభావం నేడు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తున్నట్లు చెప్పారు. అటువంటి మహనీయులు విగ్రహాలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని సంఘం సభ్యులను అభినందించారు. అదేవిధంగా స్థానిక డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో విజయనగరంలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా నగరం ఎంతో అభివృద్ధి చేశారని, రోడ్లు, కాలువలు విస్తరణ, మంచినీటి కుళాయిల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ముమ్మిడిశెట్టి సత్యనారాయణ, కార్యదర్శి డిమ్స్ రాజు, కోశాధికారి త్రినాద్, శ్రీ అమరజీవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలవెళ్లి శేఖర్, కార్యదర్శి సముద్రాల నాగరాజు, కార్పొరేటర్ నారాయణప్పుడు,స్వామి వివేకానంద విగ్రహాన్ని వితరణ చేసిన దేవరుశెట్టి శ్రీరామమూర్తి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వెత్సా సత్యనారాయణమూర్తి, తవ్వా మోహనరావు, సుధాకర్, పప్పు విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

➡️