పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు

పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు

ప్రజాశక్తి-కాకినాడసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కృతికా శుక్లా అస్యూర్డ్‌ మినిమం ఫెసిలిటీ (ఎఎంఫ్‌) సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో ఫర్నిచర్‌, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్‌ వంటి సదుపాయాల కల్పనపై అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రతి పోలింగ్‌ కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీస సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. శాఖల వారీగా వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలని కలెక్టర్‌ కతికా శుక్లా ఆదేశించారు. డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు, ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామరావు, ఆర్‌ఐఒ ఎన్‌ఎస్‌విఎల్‌ నరసింహ, డిఇఒ జి.నాగమణి, పిఆర్‌ ప్రిన్సిపల్‌ తిరుపాణ్యం, పశుసంవర్థక శాఖ జేడీ ఎస్‌ సూర్యప్రకాశరావు, మత్స్య శాఖ జెడి పివి.సత్యనారాయణ, ఐసిడిఎస్‌ పీడీ కె.ప్రవీణ పాల్గొన్నారు.

➡️