పోషకాహార పక్షోత్సవాలు

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం మండలం పేరలి పడమర గొల్లపాలెంలో పోషకాహార పక్షోత్సవాలు నిర్వహించారు. చిరు ధాన్యాలతో వంటల పోటీలు నిర్వహించారు. చిరుధాన్యాలు, ఆకు కూరల ఆవశ్యకత గురించి తెలియజేశారు. చిరుధాన్యాలు వాడటం వలన గర్భిణులు, బాలింతలలో రక్తహీనత నివారించవచ్చునని ఆరోగ్యవంతమైన బిడ్డను సమాజానికి అందిస్తామని అన్నారు. వంటల పోటీలు అత్త -కోడళ్ల మధ్య నిర్వహించి వారిని అభినందించారు. పోషక విలువలు కలిగిన ఆహారం గురించి తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. గృహ సందర్శన చేసి గర్భిణులు తీసుకోవలసిన పోషకాహారం గురించి, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్‌ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీస్‌ సూపర్‌వైజర్‌ ఎం నాగమల్లేశ్వరి, ఏఎన్‌ఎం ప్రియాంక, మహిళా పోలీస్‌ హేమ, ఆశా వర్కర్స్‌, అంగన్వాడీ కారకర్తలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.

➡️