ప్రకతి వ్యవసాయంపై శిక్షణ

Jan 3,2024 20:07
అవగాహన కలిపిస్తున్న శాస్త్రవేత్త పసాద్‌ బాబు

అవగాహన కలిపిస్తున్న శాస్త్రవేత్త పసాద్‌ బాబు
ప్రకతి వ్యవసాయంపై శిక్షణ
ప్రజాశక్తి-కందుకూరు కందుకూరు కషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త, హెడ్‌ డాక్టర్‌ జి. ప్రసాద్‌ బాబు, కందుకూరు డివిజన్‌ మాస్టర్‌ ట్రైనర్‌ సునీత ఆధ్వర్యంలో రైతులకు, రైతు మహిళలకు ప్రకతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జి ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ మామిడిలో పండు ఈగ నివారణ, జీవామతం ద్వారా పోషకాల యాజమాన్యం, బీడు భూముల పునరుద్ధరణ, ఎటిఎం మోడల్‌లో కూరగాయల పెంపకం ద్వారా నిరంతర ఆదాయం, నిమ్మ, సపోటా పంటలలో మినుములు, పెసర, జొన్న, సజ్జ, కూరగాయలు వంటి అంతర పంటలు పెంపకం తదితర అంశాలపై శిక్షణణిచ్చారు. ఈ ప్రదర్శనా క్షేత్రానికి అవసరమైన జిగురు అట్టలు, పండు ఈగ లింగాకార్షక బుట్టలు, జీవన ఎరువులు, జీవ శిలీంద్ర నాశినులు, వేప నూనె, సూక్ష్మ పోషకాల మిశ్రమాలు రైతులకు, రైతు మహిళలకు అందించారు కార్యక్రమంలో డిఎంఎటిఎస్‌లు మాధవ, రాజా, రైతులు, రైతు మహిళలు పాల్గొన్నారు.

➡️