ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఈడిగపాలెం వార్డులో రూ.80లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మేడామల్లిఖార్జునరెడ్డి, జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక దష్టి సారిస్తున్నారని అన్నారు. సంక్షేమ ప్రదాత, నిత్య కషివలుడు అయిన జగన్మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ రాంబాబు, వైస్‌ చైర్మన్‌ మర్రిరవి, వార్డు కౌన్సిలర్లు, మునిసిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పాల్గొన్నారు. పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరమని ఎంపీ మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితులకు సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. నారదాసుకి మణి రెండులక్షలు, వై.వెంకటరమణ రూ.1.60 లక్షలు, వై.జయమ్మ రూ.70 వేలు, వై.వెంకటరమణ, ఎన్‌.జయమ్మ రూ.70వేలు చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి మాట్లాడుతూ ఆపత్కాలంలో సిఎం సహాయనిధి ప్రజలను ఆదుకొని అండగా నిలుస్తుందని అన్నారు. అనంతరం పత్యరాల శ్రీ త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, జెఎసి కన్వీనర్లు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️