ప్రజల సమస్యలను పరిష్కరించండి :ఎంపిపి

Dec 16,2023 19:43
ఎంఇఒను ప్రశ్నిస్తున్న సర్పంచ్‌ సీతారామయ్య

ఎంఇఒను ప్రశ్నిస్తున్న సర్పంచ్‌ సీతారామయ్య
ప్రజల సమస్యలను పరిష్కరించండి :ఎంపిపి
ప్రజాశక్తి – లింగసముద్రం
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరానికి అధికారులు కృషి చేస్తు ,ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని మండలాభివృద్ధికి సహరించాలని మండల పరిషత్‌ అధ్యక్షులు పెన్నా కృష్ణయ్య పేర్కొన్నారు.శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మండల పరిషత్‌ కార్యలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది.శాఖల వారిగా అధికారులు వివరాలను తెలియజేశారు.చినపవని పంచాయితీ పరిధిలోని ఎస్‌టి కాలనీలో నాడు నేడు పనులు నిలిచిపోవడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం పట్ల సర్పంచ్‌ దామా సీతారామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.నిలిచిపోయిన పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఎంఈఓని ప్రశ్నించారు.త్వరిగతిన పనులు పూర్తి చేసేలా చూడాలని,విద్యార్ధులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్నారు.ఈ విషయం ఉన్నతాధికారలు దృష్ఠిలో ఉందని త్వరలోనే పనులు పూర్తి చేసేలా చూస్తామని ఎంఈఓ చెప్పారు.యర్రారెడ్డిపాలెం గ్రామంలో కూడా నాడు నేడు పనులు నిలిచిపోయాయని దీని వల్ల ప్రహరి నిర్మించకపోవడం వల్ల విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌ డబ్బుగొట్టు మల్లిఖార్జున అధికారుల దృష్టికి తెచ్చారు.పనులు నిలిచిపోబడంతో 40 కట్టలు సిమెంట్‌ బస్తాలు గడ్డకట్టాయని చెప్పారు.సమావేశాలల్లో ఎప్పుడు చెప్పిన వాటి గురించే చెబుతున్నారని కొత్తవి చెప్పాలని విశ్వరాధపురం సర్పంచ్‌ బొల్లినేని నాగేశ్వరరావు అధికారులను కోరారు.ఉపాధిహమీ ద్వారా పనులు కల్పించాలని,కొత్త రోడ్లు వేయడానికి ప్రతిపాధనలు పంపాలని అధికారులకు సూచించారు.కొత్త రేషన్‌ కార్డులు కావాల్సిన వారు ధరఖాస్తు చేసుకోవాలని,ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని తహశీల్ధార్‌ టి.ప్రసాద్‌ చెప్పారు.యర్రారెడ్డిపాలెం గ్రామంలో ఉన్న ఎస్‌టిలలో చాలామందికి ఆధార్‌ కార్డులు,రేషన్‌ కార్డులు లేవు ఇటివల తూఫాన్‌ సందర్భంగా వారితో మాట్లాడిన సమయంలో వారు సమస్యలను చెప్పారు.గ్రామ సర్పంచ్‌ డబ్బుగొట్టు మల్లిఖార్జున సహకారంతో వారి వివరాలను సేకరించడం జరిగిందని త్వరలోనే వారికి ఆధార్‌,రేషన్‌ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.జగనన్న లే అవుట్‌లో బోరు వేసి నెలలు గడుస్తున్న బిల్లులు రావడం లేదని సర్పంచ్‌ సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.పంచాయితీలకు నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ శేషుబాబు,ఎంపిటిసి సభ్యులు,సర్పంచ్‌లు, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

➡️