ప్రజాతీర్పుతో వైసిపి కనుమరుగు

Mar 8,2024 19:41

 ప్రజాశక్తి-రాజాం  : రానున్న ఎన్నికల్లో ప్రజాతీర్పుతో వైసిపి ప్రభుత్వం కనుమరుగు అవుతుందని టిడిపి రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 9వ వార్డులోని పలు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన కోసం రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తోందన్నారు. నియంత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజానీకం విసుగెత్తి పోయారన్నారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్‌ సిక్స్‌ హామీలు, బిసి డిక్లరేషన్‌పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అనంతరం కుమ్మర వీధిలో గ్రామదేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,గాంధీ వీధిలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ రాజాం పట్టణ అధ్యక్షులు నంది సూర్య ప్రకాశరావు, పొట్టా చిట్టి బాబు, టంకాల కన్నం నాయుడు, ఎస్‌ రమేష్‌ కుమార్‌, 9వ వార్డు నాయకులు ఉరిటి సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

➡️