ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి- గిద్దలూరు : ప్రజాశక్తి 2024వ సంవత్సర క్యాలండర్‌ను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు తెలిపే ప్రత్రిక ప్రజాశక్తి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి గిద్దలూరు డివిజన్‌ ఇన్‌ఛార్జి పూర్ణ చంద్రరావు, గిద్దలూరు విలేకరి మద్దిరాల గిరి, బేస్తవారిపేట విలేకరి నారాయణ రెడ్డి, వైసిపి నాయకుడు నజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️