ప్రజా ఉద్యమాలను అవమానిస్తే ఘోర ఓటమి తప్పదు

పల్నాడు జిల్లా: ఒక వైద్యునిగా, ప్రజా ప్రతినిధిగా సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని కమ్యూనిస్టులు( సిపిఎం, సిపిఐ) ఏనాడు ఒక మాట కూడా అనలేదని, అయినప్పటికీ కావాలనే దుర్ద్దేశపూర్వకంగా కమ్యూనిస్టులపై అవాకులు,చవాకులు పేలుతున్నారని సిపిఎం, సిపిఐ నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాటాలు చేస్తారని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెను కాడరని అన్నారు. నేటి రాజకీ యాలలో విలువలతో ప్రజల పక్షాన పోరాటం చేస్తోంది కమ్యూనిస్టులేనన్న విషయం పాలక ,ప్రతిపక్షాలు తెలుసుకోవాలని అన్నారు. సీట్ల కోసం, డబ్బు కోసం టిడిపి వాళ్లు వైసిపిలోక,ి వైసిపికి చెందినవారు టిడిపిలోకి చేరిన దాఖలాలు అనేకం ఉన్నాయన్నారు. కమ్యూనిస్టులు దేవుళ్లను పూజించరని తెలిసి కూడ చెత్తలో దొరికిన దేవుని పటాలను కమ్యూనిస్టులు వేశారని ఎమ్మెల్యే దుష్ప్రచారం తగదని అన్నారు. అన్ని మతాల సాంప్ర దాయాలను గౌర వించేది కమ్యూనిస్టులేనని గ్రహిం చాల న్నారు. దేవుని పటాలు చెత్త డబ్బాలో ఎవరు వేశారో విచారించి చర్యలు తీసుక ోవాలన్నారు. కార్మికులు సమ్మె చేస్తుంటే సమస్యలు పరిష్కరించడం చేత కాని ఎమ్మెల్యే , సమ్మె శిబిరాన్ని ధ్వంసం చేయ డం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సిపిఎం, సిపిఐ చేస్తున్న అనేక పోరా టాలలో పాలు పంచుకున్న ఎమ్మెల్యే గోప ిరెడ్డి ప్రస్తుతం అదే కమ్యూనిస్టులపై చౌకబారు విమర్శలు చేయడం సరి కాదన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయమని కార్మికులు అంగన్వాడీలు, సమగ్ర శిక్షా ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారని హామీలు విస్మరించి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కమ్యూ నిసు ్టలపై విమర్శలు చేయటం తగ దన్నారు. మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు ఉన్న 20 డిమాండ్లపై వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఆ దిశగా ఆలో చించడం లేదన్నారు. సీట్ల పంపకంపై ఉన్న శ్రద్ధ అంగన్వాడీ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. కమ్యూనిస్టులను , ప్రజా ఉద్యమాలను అవమానిస్తే’ ఘోరమైన ఓటమి చవి చూడాల్సి వస్తుందని నేతలు హెచ్చరించారు. సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వరుసగా ఏపూరి గోపాలరావు ,ఉలవలపూడి రాము వెంకట్‌ తదితరులు మాట్లాడారు. టిడిపికి కమ్యూ నిస్టులు అమ్ముడుపోయారని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శన మన్నారు.

➡️