ప్రతి కుటుంబంలో వెలుగులు

Jan 8,2024 20:52

ప్రజాశక్తి – బొబ్బిలి రూరల్‌ : తమ ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబలో వెలుగులు నిండాయని ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు అన్నారు. సోమవారం పిరిడి గ్రామంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను ఇంటి ముంగిటకే చేరవేస్తున్న ఘనత సిఎం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. అనంతరం నూతనంగా మంజూరైన, పెంచిన పింఛన్లు ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శంబంగి లక్ష్మీ, వేణుగోపాలనాయుడు, జెడ్‌పిటిసి సంకిలి శాంతకుమారి, సర్పంచ్‌ తుట్ట వరలక్ష్మీ, కమ్మవలస సర్పంచ్‌ పిల్లా వసుందర, కారాడ సర్పంచ్‌ సంజీవనాయుడు, ఎంపిడిఒ రవికుమార్‌, వైసిపి నాయకులు కొల్లి రామకృష్ణ పాల్గొన్నారు.పేదలకు మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. సోమవారం పిరిడి పిహెచ్‌సిని ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని వసతులను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కొత్తవలస: స్థానికి సచివాలయం-5 పరిధి చీపురువలస గ్రామంలో నూతన, పెంచిన పింఛన్లను ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్లను రూ.3వేలకు పెంచిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అద్యక్షుడు ఒబ్బిన నాయుడు, జెసిఎస్‌ మండల ఇంచార్జి బొంతల వెంకటరావు, పిఎసిఎస్‌ అద్యక్షుడు గొరపల్లి శివ, వైస్‌ ఎంపిపి కర్రి శ్రీను, కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వీరబద్రపురం సర్పంచ్‌ గేదెల త్రినాధమూర్తి, వేపాడ వైసిపి మండల అద్యక్షుడు ముమ్ములూరి జగన్నాధం, సింగరాయి సర్పంచ్‌ నీరుజోగి వెంకటరావు, సచివాలయం కన్వీనర్‌ బంగారు శ్రీను, చీపురువలస కృష్ణ, సూరిబాబు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️