ప్రపంచ మేథావి అంబేద్కర్‌

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 67వ వర్ధంతిని వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని మాసాపేటలోని అంబేద్కర్‌ విగ్రహానికి మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, వైస్‌ చైర్మన్‌ ఫయాజుర్‌ రెహమాన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్‌. స్థానిక కౌన్సిలర్లు, వైఎస్‌ఆర్‌ సిపి నాయకులతో కలసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోహార్‌ అంబేద్కర్‌ అంటూ పెద్దఎత్తున నినదించారు. దేశానికి వారు చేసిన సేవలను వైఎస్‌ఆర్‌ సిపి నాయకులు గుర్తు చేసుకున్నారు. భారతజాతిని జాగత పరిచిన ఆదర్శమూర్తి ప్రపంచ మేథావి బిఆర్‌.అంబేద్కర్‌ అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, న్యాయశాస్త్ర నిపుణుడు, ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రజ్ఞుడు,చరిత్ర కారుడు,రాజనీతి కోవిదుడుగా అంబేద్కర్‌ పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు.ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడిచి, వారి ఆశయ సాధనకు కషి చేసినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు. నందలూరు: డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని నాగిరెడ్డిపల్లి మేజర్‌ గ్రామపంచాయతీ బస్టాండ్‌ కూడలిలోని అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్‌ ఎస్‌సి, ఎస్‌టి మానిటరింగ్‌కమిటీ సభ్యులు పెనుబాల నాగసబ్బయ్య, జిల్లావక్ఫ్‌ బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ అమీర్‌, మోడపోతుల రాము, అర్ముగం విశ్వనాధ్‌, కాకి చంద్ర, నాగభూషణం, బొమ్మి మధు, తుమ్మది శివ, ఎజిపి సమీవుల్లా, మోహన్‌రెడ్డి, ఎంపిటిసి గునాయదవ్‌, శివ నరసింహులు, శివరాం పాల్గొన్నారు.మదనపల్లి : భారత రాజ్యాంగ సష్టికర్త డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోఆర్‌డిఒ ఎంఎస్‌ మురళి, సిబ్బంది అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన రచించిన రాజ్యాంగం వల్ల అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛ వాయువును పీల్చుకోగలుగు తున్నామని అన్నారు. కార్యక్రమంలో డిఎఒ శేషయ్య, గురు ప్రసాద్‌, పద్మనాభం పాల్గొన్నారు. విసికె పార్టీ ఆధ్వర్యంలో.. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 67 వ వర్ధంతిని కుల నిర్మూలనా పోరాట అమర వీరుల దినంగా విసికె పార్టీ, భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌) సంయుక్తంగా జరుపుకున్నారు. స్థానిక బెంగళూరు రోడ్డు నందలి న్యూ అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద విసికె పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిటిఎం శివప్రసాద్‌ అధ్యక్షన జరిగిన కార్యక్రమానికి విజయభారతి హైస్కూల్‌ కరెస్పాండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.సేతు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ సర్వతోముఖాభివద్ధికి బహుముఖ సేవలందించిన గొప్ప దేశభక్తుడు అంబేడ్కర్‌ అని కొని యాడారు. కార్యక్రమంలో విసికె, బాస్‌ నాయకులు బురుజు లక్ష్మీనా రాయణ, మునివెంకటప్ప, నీరుగట్టి రమణ, పీర్‌బాషా, పి. రవిశంకర్‌లు పాల్గొన్నారు. బహుజనసేన ఆధ్వర్యంలో.. బహుజనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఓబులేసుచ బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు అన్న, చందు, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శీనన్న, హెల్పింగ్‌ మైండ్స్‌ అబూ అమీన్‌ బహుజన సేన మైనారిటీ నాయకులు నూర్‌అలాల్‌, బిసి నాయకులు పాల్గొన్నారు. సుండుపల్లి: అంబేద్కర్‌ విగ్రహానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు మాలమహానాడు రాష్ట్ర నాయకులు కె.వి రమణయ్య , దళిత నాయకులు, జనసేన నాయకురాలు, రెడ్డిరాణిలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. పీలేరు: పీలేరు పంచాయతీ కార్యాలయ సర్కిల్లోని అంబేద్కర్‌ విగ్రహానికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .కార్యక్రమంలో మాల మహనాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల ధరణ్‌ కుమార్‌, భారతీయ అంబేద్కర్‌సేన జిల్లా కో-కన్వీనర్‌ పాలకుంట శ్రీనివా సులు, ముస్లిం జెఎసి నాయకులు షేక్‌అమీరుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో మాలమహనాడు రాయలసీమ జిల్లాల సహయ కార్యదర్శి ఎంఎస్‌పి, ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో.. అంబేద్కర్‌ 67వ వర్ధంతిని ఎంఎస్‌పి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండికోట వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పీలేరు పంచాయతీ సర్కిల్లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు రామాచారి, విహెచ్‌ పిఎస్‌ నాయకులు భాస్కర, ఎంఆర్‌పిఎస్‌ పీలేరు ఇన్‌ఛార్జి చరణ్‌ కుమార్‌, కెవిపల్లి ఎంఆర్‌పిఎస్‌ నాయకులు రాజేష్‌, ప్రణీత్‌, ఎంఎస్‌పి యశస్విని పాల్గొన్నారు.నగరిమడుగు సుభాష్‌, జెట్టి మల్లికార్జున, సీనియర్‌ నాయకులు కె.గట్టప్ప, రామాపురపు ద్వారాకనాథ్‌, బాస్‌ జిల్లా నాయకులు ముల్లంగి క్రిష్ణయ్య పాల్గొన్నారు. నిమ్మనపల్లి: నిమ్మనపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహానికి రాజంపేట పార్లమెంట్‌ టిడిపి అధికార ప్రతినిధి ఆర్‌జె.వెంకటేష్‌, మునిరత్నం స్థానిక దళిత సంఘ నాయకులు ప్రజా సేవాసంస్థ అధ్యక్షులు సహదేవ, జయన్న, చండ్రాయుడు,తవళం సర్పంచ్‌ రెడ్డప్ప, ముబారక్‌లతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రపంచ మేధవి అన్నారు. దళిత కులంలో జన్మించిన జాతి రత్నమని, ఎంతో ముందు చూపుతో ఆయన రాసిన రాజ్యాంగం భారత దేశానికి దిశా, దశ నిర్దేశంగా ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, మునిరత్నం, దళిత సంఘ నాయ కులు పాల్గొన్నారు. కలికిరి: స్థానిక బస్టాండ్‌ సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌సి ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు రవీంద్ర, జయరాం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాల అభివద్ధి కోసం, దేశ అభివద్ధి కోసం రాజ్యాంగాన్ని రచించి రిజర్వేషన్లు ఏర్పాటుచేసి పేద,బడుగు, బలహీన వర్గాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. కార్యక్రమంలో అగస్తీశ్వర, శ్రీనివాస వర్మ, సిద్దయ్య, శ్రీనివాసులు, అశోక్‌, రమణ, యేసురాజు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి నాయకులు పాల్గొన్నారు. బి.కొత్తకోట :తహసిల్దార్‌ కార్యాల యంలో తహశీల్దార్‌ రఫీక్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ అంబేద్కర్‌ సేన జిల్లా కార్యదర్శి సింగన్న, డిటి అన్సారి, విఆర్‌ఒ సోమశేఖర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పుల్లంపేట : మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ వర్ధంతిని నియోజక నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోసాలదేవి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎస్‌సి సెల్‌ కన్వీనర్‌ శాంతయ్య, జిల్లా నాయకులు కె.వి ప్రతాప్‌ రెడ్డి, మండల ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు పెంచలయ్య, కొరముట్ల రాము, మండల అధ్యక్షుడు సిగమాల రమేష్‌ పాల్గొన్నారు. తంబళ్లపల్లి: స్థానిక వైద్య విధాన పరిషత్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటరామయ్య, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు భాస్కర్‌, మల్లికార్జున,జగదీష్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహిం చారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పిఒఆర్‌డి, సిబ్బంది రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి ,మధుబాల ,పివి రమణ పాల్గొన్నారు.

➡️