ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు అప్రమత్తంగా ఉండాలి

Mar 26,2024 23:56

మాట్లాడుతున్న కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలయ్యేలా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీంలు అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్‌, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కమిషనర్‌ చాంబర్‌లో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బందాలు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీ-విజిల్‌ యాప్‌లో అందే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశిత సమయంలో హాజరై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిబందనలు పాటించని అభ్యర్థులపై కేసులు నమోదు చేయాలన్నారు. అనుమతి లేకుండా ప్రచారాలు, ర్యాలీలు చేసినా, అనధికార నగదు తరలించినా వెంటనే కేసులు నమోదు చేయలని, బృందంలో పోలీసు సిబ్బంది మరింత భాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ఎక్స్‌పెండిచర్‌ టీంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవడంలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ముందుండాలని, క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఎదురైనా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో సెక్టోరల్‌ అధికారి శ్రీధర్‌, ఏఆర్‌ఓలు సునీల్‌, భీమరాజు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ నాగేంద్ర కుమార్‌, ఎక్స్పెండీచర్‌ టీం, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీంలు పాల్గొన్నారు.

➡️