బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ ర్యాలీ

Jan 19,2024 21:54
ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నాయకులు
బకాయిలు చెల్లించాలని యుటిఎఫ్‌ ర్యాలీ
ప్రజాశక్తి-కోవూరు : ప్రభుత్వం ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని శుక్రవారం కోవూరు తాలూకా ఆఫీస్‌ సెంటర్‌ నుంచి బజార్‌ సెంటర్‌ వరకూ యుటిఎఫ్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనుద్దేశించి యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వ కార్యక్రమాల వాడుకుంటూ దాచుకున్న సొమ్మును అవసరాలకు లోను రూపంలో అడగ్గా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న పిఆర్‌సి, డిఎ, సరెండర్‌ లీవ్‌, పిఎఫ్‌, ఎపిజెఎల్‌ఐ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. విడుదల చేయని పక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఖాజావలీ, భారతి, రాష్ట్ర కౌన్సిలర్‌ సీనయ్య, కోవూరు, కొడవలూరు, విడవలూరు, అల్లూరు మండలాల అధ్యక్షులు రవిచంద్ర, మాలకొండయ్య వెంకటేశ్వర్లు రమణకుమారు, జెవివి నాయకులు భాస్కర్‌ రావు, రహంతుల్లా, మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️