బకెట్లకు ఆశపడితే భవిష్యత్‌ అందకారమే

Mar 5,2024 21:24

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఎన్నికలు నేపథ్యంలో గ్రామాల్లో పంచుతున్న బకెట్లకు ఆశపడి వారిపట్ల ఆసక్తి చూపితే భవిష్యత్తంతా అందకారంగా మారిపోతుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. నవరత్నాలు, పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్ధానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదోడి సొంతింటి కళ నేరవేర్చింది వైసిపి ప్రభుత్వమేనన్నారు. మండలం మొత్తం 951 పట్టాలను రిజిష్ట్రేషన్‌ చేసి పంపిణీ చేసే ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. ప్రతి ఇంటికి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం వైసిపితోనే సాధ్యమన్నారు. గడప గడపకు సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదే అన్నారు. రానున్న ఎన్నికల్లో మనమంతా జగనన్న పక్షాన ఉండి మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మహంతి కళ్యాణి, జెడ్‌పిటిసి మహంతి సీతాలక్ష్మి, వైస్‌ ఎంపిపిలు చంటి రాజు, అల్లాడ రమేష్‌, మండల పార్టీ అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, రామతీర్దం ఆలయ బోర్డు సభ్యులు డి. త్రినాదరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ మహంతి లక్ష్మణరావు, నాయకులు పుప్పాల లక్ష్మినారాయణ, మహంతి జనార్ధనరావు, స్ధానిక సర్పంచి టి. సీతారాం, డి. గణేష్‌, మొంగం నాగబాబు, రౌతు సాయి, తహశీల్దార్‌ ప్రవలిక, ఎంపిడిఒ రాధిక సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️