బడుగు వర్గాల మహిళలపై అణచివేత

Mar 8,2024 21:47
ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

ఫొటో : నినాదాలు చేస్తున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి
బడుగు వర్గాల మహిళలపై అణచివేత
ప్రజాశక్తి-బిట్రగుంట : జగనన్న పాలనలో బడుగు వర్గాల మహిళలను అణిచివేశారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా బోగోలు మండలం రామస్వామిపాలెం యానాది కాలనీలో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ జగనన్న పాలనలో ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్‌లను మూతవేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా సొంత పథకాలకు మళ్లించుకొని కోట్ల రూపాయిలు కార్పొరేట్‌ స్కూళ్లకు వేశారని తెలిపారు. చేయూత అని 45 సంవత్సరాలు పైబడిన మహిళలకు గ్రామానికి ఇద్దరికి రూ.17వేలు ఇచ్చి వారి ముందు గొర్రెలు తోలి ఫొటోలు తీసి రూ.17వేలకు ఒక్క గొర్రె కూడా రాదని తెలిపారు. మహిళలకు వేసే సగం నగదును అప్పుల కింద బ్యాంక్‌ వారు జమ చేస్తున్నారని తెలిపారు. దళిత, గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికి కూడా నష్టపరిహారం సంవత్సరం నుండి ఇవ్వలేదన్నారు. దళిత గిరిజన మహిళల పరిస్థితి దుర్బంగా ఉందన్నారు. ఈ విధంగా ఆర్థికంగా, సాంఘికంగా వారి హక్కులను అణిచివేశారని తెలిపారు. అత్యాచారాలు జరిగితే కేసు పెడితే కౌంటర్‌ కేసు పెట్టి వారినే జైలుకు పంపించారని తెలిపారు. దళిత యానాది సంఘం తరుఫున మీటింగ్‌ పెట్టుకుంటే ఆ నాయకులకు ముందస్తు నోటీసు ఇచ్చి గృహ నిర్బంధం చేశారని తెలిపారు. ఇంత ఆర్థిక సామాజిక దోపిడీ చేసి బడుగు వర్గాల మహిళలను ఆర్థికంగా దీనస్థితికి తీసుకొని వచ్చారని తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఇళ్ళల్లో పనిచేసే తుపాకుల శాంతమ్మ, మణికల రమణమ్మలకు గ్రామస్థులందరూ సన్మానం చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ చైర్మన్‌ తుపాకుల పొట్టెయ్య, చెంచయ్య, మానికల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️