బ‌దిలీలు, ప‌దోన్న‌తులు చేప‌ట్టాలి : ఎస్‌టీయు

Nov 30,2023 17:46 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని : మునిసిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంట‌నే చేప‌ట్టాల‌ని ఎస్‌టీయు రాష్ట్ర అద‌న‌పు కార్య‌ద‌ర్శి నాగ‌రాజు డిమాండ్ చేశారు. గురువారం ఆదోనిలోని ఎస్టీయు భ‌వ‌న్‌లో సుధాక‌ర్ అధ్య‌క్ష‌తన జ‌రిగిన డివిజ‌న్ స్థాయి స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధీనంలో ఉన్న‌ మండల, జిల్లా పరిషత్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మూడేళ్ల‌లో రెండు పర్యాయాలు జరిగేవ‌న్నారు. రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల 2019 నుంచి చేప‌ట్టలేదన్నారు. డిసెంబర్‌లో బదిలీలు, పదోన్నతులు షెడ్యూల్డ్ విద్యాశాఖ విడుదల చేయకపోతే ఆందోళనకు దిగుతామన్నారు. ఈ సమావేశంలో లోక్య నాయక్, రమేష్ నాయుడు, సుంకన్న, గోపాల్, రవి, వీర చంద్ర యాదవ్, భీమరాజు, రామకృష్ణ, మహాదేవప్ప, షేక్షావలి, ఉరుకుందప్ప, రామాంజనేయులు, జంబులయ్య, ఆంజనేయులు, లక్ష్మణ, రామ్మోహన్ రెడ్డి, నాగేంద్ర, జయరాం, శ్రీరాములు, గంగానాయక్, వెంకటరామిరెడ్డి, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

➡️