బీడు వారిన చెరువులు

Mar 27,2024 21:32

ప్రజాశక్తి-పాలకొండ : బీడు వారిన చెరువులను పట్టించుకోకపోతే ఈ వేసవిలో రైతులకు ఇబ్బందులు తప్పవు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మండలంలో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెలగవాడ నరసింహ చెరువు పూర్తిగా ఎండిపోయి బీడువారింది. దీంతో ఆ చెరువు పరిధిలో ఉన్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తోటపల్లి ఎడమ కాలువ ద్వారా నీరు రెండేళ్లుగా చివరి ప్రాంతమైన వెలగవాడ చెరువుకు అందకపోవడంతో చెరువు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రబీ పంటకు నీరు అందే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌ అధికారులు స్పందించి నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️