బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు..

Dec 14,2023 19:35
ఉలవపాడులో అంగన్‌వాడీల నిరసన దృశ్యం

ఉలవపాడులో అంగన్‌వాడీల నిరసన దృశ్యం
బెదిరింపులతో ఉద్యమాన్ని ఆపలేరు..
ప్రజాశక్తి-ఉలవపాడు : అంగన్‌వాడీల ఆందోళన 3వ రోజుకు చేరింది.ఉలవపాడు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు వద్ద గురువారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు వినూత్నంగా మోకాళ్ళతో నిలబడి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిరసించారు. ఈ సందర్భంగా అంగన్వాడి ప్రాజెక్టు నాయకులు సి.హెచ్‌ ఇందిరావతి,వాకా.లతా రెడ్డి ఎస్‌.కే పద్మజ బి.మార్తమ్మలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు లొంగబోమని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. అలాగే అంగన్వాడీలను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపాలనుకోవడం అవేకమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టుదలకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయని అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పట్ల మొండిగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయాలని అందుకనే బలవంతంగా తెరిపించాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. జగన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. నేను మాట తప్పను మడమ తిప్పను నా మాట నమ్మండి అని చెప్పి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అంగన్వాడీల విషయంలో మాట తప్పారని, మడమ తిప్పారని ఆయన అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కాకపోతే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు.ఉలవపాడు గుడ్లూరు లింగసముద్రం మండలాల అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కత్తి బుజ్జమ్మ, బర్రె తిరుపతమ్మ, పి రమణి, ప్రసన్న, ఎస్‌ పద్మజ, సిహెచ్‌ పద్మజ,గీత తదితరులు పాల్గొన్నారు

➡️