బ్రహ్మోత్సవాలకు 30 ప్రత్యేక బస్సులు

Mar 17,2024 21:47
ఫొటో : మాట్లాడుతున్న కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు

ఫొటో : మాట్లాడుతున్న కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు
బ్రహ్మోత్సవాలకు 30 ప్రత్యేక బస్సులు
ప్రజాశక్తి-కావలి : బిలకూటకేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 30 ప్రత్యేక బస్సులను నడుపుతామని ఎపిఎస్‌ ఆర్‌టిసి కావలి డిపో మేనేజర్‌ రాపూరు శ్రీనివాసులు తెలిపారు. ఈసారి తెప్పోత్సవం, గరుడ సేవ, కళ్యాణ మహోత్సవం శుక్ర, శని, ఆదివారాలలో వచ్చినందున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువమంది భక్తులు రావచ్చని అంచనాకు వచ్చామని, అందువల్ల గత సంవత్సరం 24 ప్రత్యేక బస్సులు నడుపగా, ఈ సంవత్సరం 30బస్సులు నడుపనున్నామన్నారు. 22, 23, 24 తేదీలలో బస్సులు భక్తులు, ప్రయాణికులకు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కావలి, అల్లూరు, చెన్నారాయునిపాలెం, శంభునిపాలెం, ఇస్కపల్లి, నెల్లూరు తదితర ప్రాంతాల నుండి కొండబిట్రగుంటకు ఆ మూడు రోజులు ఎల్లవేళలా బస్సులు నడపడంతో పాటు కావలి, ముంగమూరు తోటలు, అల్లూరు, నెల్లూరులలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి వాలంటీర్లను, మెకానిక్‌ సిబ్బందిని భక్తులు, ప్రయాణికుల సేవలందించడానికి నియమిస్తామన్నారు. కావున భక్తులు, ప్రయాణికులు కొండబిట్రగుంట శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామివారి బ్రహోత్సవాలకు ఆర్‌టిసి బస్సులను వినియోగించుకుని సురక్షితంగా, సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రాఫిక్‌) కెవిఆర్‌ బాబు, సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రామకృష్ణ, డిసి ( యెర్నింగ్స్‌) ఐ బ్రహ్మారెడ్డి, డిపో మార్కెటింగ్‌ ఏక్సిక్యూటివ్‌ డి.రవిప్రకాష్‌, మార్కెటింగ్‌ టీం ఎస్‌కె.మస్తాన్‌, కెవి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️