భవన నిర్మాణకార్మికుల ధర్నా

Dec 28,2023 21:09

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యాన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఫ్రధాన కార్యదర్శి కె.సురేష్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి. రమణ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నిధుల ద్వారా భవన నిర్మాణ కార్మికల సంక్షేమం కొసం గతంలో ఉన్న పథకాలు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదం జరిగి వికలాంగులైతే రూ.2లక్షలు, మరణిస్తే రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇసుక, ఇనుము, ఇతర భవన నిర్మాణ వస్తువులు ధరలూ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో ఆ సంఘం నాయకులు కంది త్రినాధరావు, విశ్వనాధం, త్రినాధ్‌ రమేష్‌, ఎర్రిబాబు, సతీష్‌ పాల్గొన్నారు. ధర్నాకు ఐద్వా నాయకులు పి.రమణమ్మ, వి.లక్షి మద్దతు తెలిపారు.

➡️