భీమేశ్వర దేవస్థానం ఈఓ,సిబ్బందికి కలెక్టర్‌ సన్మానం

Feb 27,2024 14:18 #collector, #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం (అంబేద్కర్‌ కోససీమ) : ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించినందుకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా దేవస్థానం ఈవో తారకేశ్వరరావును కార్యాలయ సిబ్బందిని అభినందించి ఘనంగా సత్కరించారు. స్వామి వారి కళ్యాణ మహౌత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం స్వయంగా కలెక్టర్‌ పర్యవేక్షించారు. దేవాలయ అర్చక స్వాములను, కార్యనిర్వహణాధికారి వారిని, సిబ్బందిని అందర్నీ పేరుపేరునా అభినందించి మెమెంటోలు, సాలువాలతో సత్కరించారాని ఈవో పితాని తారకేశ్వరరావు విలేకరులకు తెలిపారు.

➡️