మదనపల్లెలో కేంద్ర బలగాల కవాతు

ప్రజాశక్తి-మదనపల్లి రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో భాగంగా శుక్రవారం మదనపల్లిలో కేంద్ర సాయుధ బలగాలతో కవాతు నిర్వహించామని డిఎస్‌పి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. మదనపల్లిలో పోలీస్‌ 30 యాక్ట్‌ అమలలో ఉందని చెప్పారు. సభలు సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సిఐలు వల్లిబాషా, యువరాజు, ఎన్‌.శేఖర్‌, సద్గురుడు, ఎస్‌ఐలు వెంకటసుబ్బయ్య, వెంకటేష్‌, రవి కుమార్‌ ఎఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

➡️