మహిళలను కించపరిచేవారిపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీలోకి మహిళలను ప్రజాశక్తి-మదనపల్లి స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మదనపల్లి నియో జకవర్గం నాయకులు ఎస్‌.రెడ్డీ సాహెబ్‌ ఆధ్వర్యంలో నీరుగట్టివారిపల్లినకు చెందిన మహిళలు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, ప్రజల జీవితాలను నడ్డి విరిచే విధంగా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాలను విసిగి వేశారేసిన ప్రజలు అందరూ ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారన్నారు. తల్లి, చెల్లి అనే సంబంధాలను కూడా విస్మరించి మహిళా లోకానికి అవమాన పరిచేలా ట్రోలింగ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రోలింగ్‌ చేస్తున్న వారిపై జగన్‌ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతమని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళా లోకానికి గౌరవించేలా వ్యవహారించాలని హితవు పలికారు. తల్లిని, చెల్లిని గౌరవించలేని నాయకులు రాష్ట్రంలోని మహిళలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండలం అధ్యక్షులు సురేంద్రరెడ్డి, మహిళా అధ్యక్షులు వై.ఈశ్వరమ్మ, మహమ్మద్‌ రఫీ, మహమ్మద్‌ అలీ, అమిర్‌ జాన్‌, ఎస్‌సి సెల్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఇ.రవీంద్ర లు పాల్గొన్నారు.

➡️