మహిళల పట్ల పాలకుల వైఖరి మారాలి

Mar 11,2024 21:32

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: మహిళ అనే వివక్ష రాష్ట్రపతి నుండి వంటగది దాక ఉంటుందని, మహిళలు రాష్ట్రపతి అయిన నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కానీ పిలువలేదని, భారతదేశం తరఫున ఒలంపిక్స్‌లో పాల్గొని బంగారు పతకాలు తెచ్చిన వారి మీద రెజ్లింగ్‌ కమిటీ అధ్యక్షుడి అత్యాచారం ఆగలేదని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి సరిత, సహాధ్యక్షులు రెహనా బేగం అన్నారు. సోమవారం స్థానిక యుటిఎఫ్‌ కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమం యుటిఎఫ్‌ కార్యవర్గ సభ్యులు దీనావతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బేటి బచావో.. బేటి పడావో పేరుతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకుంటూనే మహిళలపై హింసకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. మరణిపూర్‌లో మహిళల్ని అత్యంత దారుణంగా నగంగా ఊరేగించినా ప్రధాన మోడీ పెదవి విప్పకపోవడం, దోషులను శిక్షించకపోవడం చూస్తే వీరికి మహిళ పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ఇకనైనా మహిళలను చులకనగా చూసే వైఖరి మారాలని హితవు పలికారు. మాజీ ప్రధానోపాధ్యాయులు మీనా కుమారి, ఐద్వా నాయకురాలు భువనేశ్వరి, సిఐటియు నాయకులు షకీలా బేగం, సుజని, లీలావతి, రేవతి, రోజా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.మణి గండన్‌, జిల్లా కార్యదర్శులు రెడ్డెప్ప నాయుడు, ఎస్‌పి బాషా, ఏకాంబరం, పార్థసారధి, సురేష్‌, గణేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️