మీడియా సంస్థలపై దాడులు హేయం

ప్రజాశక్తి-వెలిగండ్ల : మీడియా సంస్థలపై దాడులు దారుణమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి తప్పదని తేలిపోవడంతో జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సంస్థలు, ప్రతినిధులపై వైసిపి రౌడీ ముఠాలతో జగన్‌రెడ్డి దాడులు చేయి స్తున్నారు. చొక్కాలు మడతపెట్టండి అంటూ జగన్‌రెడ్డి సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైసిపి కార్యకర్తలు మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థలపై దాడులకు పాల్ప డుతున్నారు. నియంతలకు, నిరంకుశత్వ పాలకులకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని తెలిపారు. ఇలాంటి వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదన్నారు. .ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, నాయకులు దొడ్డ వెంకట సుబ్బారెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్‌రెడ్డి, టిడిపి ఎస్‌సి సెల్‌ ప్రధాన కార్యదర్శి గోనా ప్రతాప్‌, జిల్లా అధికార ప్రతినిధి గవరకట్ల హరికష్ణ, వెలిగండ్ల ఎంపిటిసి చిలకల వెంకటేశ్వరరెడ్డి, కొండ్రు విజయభాస్కర్‌రెడ్డి, టి.సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.దర్శి : మీడియా కార్యాలయాలపై దాడి హేయయమైన చర్య అని టిడిపి మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు అన్నారు. టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, వైస్‌ చైర్మన్‌ గర్నెపూడి స్టీవెన్‌, క్లష్టర్‌ ఇన్‌ఛార్జి నారపుశెట్టి మధు, తెలుగు యువత మీడియా కోఆర్డినేటర్‌ బత్తుల శ్రీనాధ్‌, నాయకులు పారా గాలెయ్య, కోటేశ్వరరావు, సైదారావు, బాచిన శ్రీను,నారాయణ స్వామి పాల్గొన్నారు. యర్రగొండపాలెం : ప్రశ్నించే గళం వింటేనే వైసిపి ప్రభుత్వానికి ఒణుకు పుడుతుందని, అందుకే ప్రతిపక్ష పార్టీలు, మీడియా అంటే భయమని తెలిపారు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు మీడియా సంస్థలపై దాడులు చేయిస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌ బాబు తెలిపారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడారు. ఓటమి ఖాయమని తెలిసి ఉద్దేశ పూర్వకంగానే మీడియా సంస్థలు, ప్రతినిధులపై వైసిపి రౌడీలు దాడులు చేస్తు న్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్లు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్‌, నాయకులు చిట్టేల వెంగళరెడ్డి, బోడా చెన్న వీరయ్య, షేక్‌ మస్తాన్‌వలి, షేక్‌ వలి, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, తోటా మహేష్‌ నాయుడు, మంత్రూ నాయక్‌, కిశోర్‌, చెవుల అంజయ్య, వెంకట్రావు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️