మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Feb 14,2024 19:00
నిరసన తెలుపుతున్న దృశ్యం

నిరసన తెలుపుతున్న దృశ్యం
మున్సిపల్‌ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి-నెల్లూరుమున్సిపల్‌ కార్మికులు తమ న్యాయమైన సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 16 రోజుల పాటు సమ్మె చేపట్టారు. ఈ సమయంలో ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు నిర్వహించిన సమయంలో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ లభించడంతో సమ్మెను విరమించి విధులకు హాజరైయ్యారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రతినిధుల నుంచి హాలకుసంబంధించి ఒప్పంద జీవోలు విడుదల చేయాలని కార్మికులు బుధవారం కార్పొరేషన్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా కార్యదర్శి కే. పెంచల నరసయ్య మాట్లాడుతూ డిసెంబర్‌ 26 నుండి జనవరి 10 వరకు జరిగిన సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులను చర్చిలకు పిలిచి పారిశుద్ధ్య కార్మికులకు 21000 జీతం, డ్రైవర్స్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మలేరియా కార్మికులకు 24,500, ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్‌, అన్‌ స్కిల్డ్‌ వేతనాలు చెల్లిస్తామని, సంక్షేమ పథకాల అమలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర డిమాండ్స్‌ నీ ఆమోదిస్తూ మినిట్స్‌ కాపీ ఇవ్వడం జరిగింది. సమ్మె విరమించి 37 రోజులు కావస్తున్న వాటిని జీవోలు రూపంలో ఇవ్వకుండా తాత్సారం చేయడం దారుణం. అంతేకాకుండా సమ్మె కాలపు జీతం చెల్లించాలని, సంక్రాంతి కానుకగా వెయ్యి రూపాయలు ఇస్తామని జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన కానీ ఆ వేతనాలు కూడా ఇంతవరకు కార్మికుల ఖాతాలో జమ కాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మె విరమణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే జీవోల రూపంలో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మరో పోరాటం తప్పదని అన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నగర రూరల్‌ కార్యదర్శులు అశోక్‌, దేశ మూర్తి, సునీల్‌, లోకేష్‌, ఎం శ్రీను, మహేష్‌, మల్లేశ్వరి, మరియన్న తదితరులు పాల్గొన్నారు.

➡️