‘మైనింగ్‌ మాఫియా లీడర్‌ సిఎం జగన్‌’

సహజ వనరులు

ప్రజాశక్తి-కడియంసహజ వనరులు ఖనిజ సంపద దోపిడీ చేస్తున్న మైనింగ్‌ మాఫియాకు ముఖ్యమంత్రి జగన్‌ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. మండలంలోని బుర్రిలంక ఇసుక ర్యాంపునును బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తవ్వుకో, దోచుకో, దాచుకో అన్నట్టు జగన్‌ వ్యవహారం ఉందని వైసిపి నాయుకులు ప్రజాప్రతినిధులు చెడ్డీ గ్యాంగ్‌లా తయారై సహజ సంపదలను దోచేస్తున్నారన్నారు. తవ్వకాలు అనుమతులకు సంబంధించి ఏవిధమైన రికార్డులు రాయడం లేదని, తాము రావడంతో ఇక్కడ సిబ్బంది పారిపోయారన్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, రెవిన్యూ, ఆర్‌డిఒ, అధికారులు పత్తా లేకుండా పోయారని అన్నారు. నదీగర్భంలో భారీయంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తూ పర్యావరణ అనుమతులు అతిక్రమిస్తున్నారని, అధికలోడులతో రోడ్లను ఛిద్రం చేస్తున్నారన్నారు. సంవత్సరాల తరబడి రోజూ వందలాది లారీల్లో వేలాది టన్నులు ఇసుక తరలించుకు పోతున్నారని, దీని వల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలకు, కాటన్‌ బ్యారేజ్‌కు ప్రమాదం ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️