మోకాళ్లపై నుంచుని శానిటేషన్‌ వర్కర్ల నిరసన

మోకాళ్లపై నుంచుని శానిటేషన్‌ వర్కర్ల నిరసన

ప్రజాశక్తి-గొల్లప్రోలు (పిఠాపురం)సమస్యలు పరిష్కరించాలని నగర పంచాయతీ శానిటేషన్‌ వర్కర్లు చేస్తున్న సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. నగర పంచాయతీ కార్యాలయం వద్ద శానిటేషన్‌ వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని మోకాళ్లపై నుంచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పండగ సెలవులు అమలు చేయాలన్నారు. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు కె.విశ్వనాథం, కుంచే చిన్న, అంగన్వాడి వర్కర్స్‌ నాయకులు బి.తులసీదేవి, అమల, యుటిఎఫ్‌ నాయకులు సీతరామరాజు, పద్మనాభం మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్‌ వర్కర్స్‌ నాయకులు నీలాపు యేసమ్మ, సిహెచ్‌వి.రమణ, పోలమ్మ, సత్తిబాబు, రామారావు పాల్గొన్నారు.

➡️