మోపాడులో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’

Nov 29,2023 20:33
మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మహీధర్‌ రెడ్డి

మాట్లాడుతున్న ఎంయల్‌ఎ మహీధర్‌ రెడ్డి
మోపాడులో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’
ప్రజాశక్తి-కందుకూరు మండలంలోని మోపాడు గ్రామ సచివాలయం పరిధిలో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ ఆంధ్రప్రదేశ్‌ కి జగనే ఎందుకు కావాలంటే” కార్యక్రమాలను బుధవారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. పేదల పక్షాన నిలబడిన ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చున్నారు. అందుకే జగన్మోహన్‌ రెడ్డి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. కందుకూరు మండల వైసిపి అధ్యక్షుడు గంగవరపు వెంకటరావు, మండల జెసియస్‌ కో ఆర్డినేటర్‌ చీమల వెంకట రాజా, ఎయంసి మాజీ చైర్మన్‌ తోకల కొండయ్య, కోవూరు సర్పంచ్‌ ఆవుల మాధవరావు, కొండి కందుకూరు సర్పంచ్‌ కుమ్మర బ్రహ్మయ్య, జెట్‌పిటిసి ప్రతినిధి తొట్టెంపూడి శ్రీనివాసరావు , ఎంపిపి ప్రతినిధి ఇంటూరి మాధవ రావు, సచివాలయం కన్వీనర్లు ఉన్నారు.

➡️